Wednesday, September 27, 2006

 

షార్క్ కడుపులో 55 పిల్లలు

ప్రపంచంలో ఎన్నెన్నో వింతలు. ఒకే కాన్పులో ముగ్గురు లేదా నలుగుర్ని కనడం మనుషుల విషయంలో వింత అయితే, అక్కడెక్కడో ఇంకొవిడ ఏడుగురు పిల్లల్ని కనడానికి సిద్ధంగా ఉందట (ఈ సమాచారం అందేనాటికి...). ఇప్పుడు సముద్ర జీవుల విషయానికి వస్తే... ఒక షార్క్ చేప లెక్కకు మించిన సంఖ్యలో 55 పిల్లల్ని కంది. అయితే, ఇందుకోసం ఘోరంగా దాని ప్రాణాలు తీసారు. అదే పాపం అనిపించింది. ఆ వివరాలు మీ కోసం...

బోకా గ్రాండే ప్రాంతంలో మే 23న హేమర్‌హెడ్‌ షార్క్‌ (1,262 పౌండ్ల బరువు, 14.5 అడుగుల పొడవు, 3 అడుగుల వెడల్పు) కడుపులో 55 పిల్లలతో జాలరి బకీ డెనిస్ మిత్ర బృందానికి చిక్కింది. హేమర్‌హెడ్‌ షార్క్‌ కడుపులో ఇన్ని పిల్లలు ఉండడం ప్రపంచ రికార్డు. తరువాత ఈ షార్క్‌ను పోస్ట్‌మార్టమ్‌ నిమిత్తం మోటె మెరైన్‌ ల్యాబరెటరీకి తరలించారు. దీని వయసు 40 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటివరకు ఈ షార్క్‌ ఒకేసారి 20 నుంచి 40 పిల్లలకు మాత్రమే జన్మనివ్వగలదనేది అందుబాటులో ఉన్న సమాచారం.

దీనికి ముందు, 1982లో 991 పౌండ్ల బరువుగల షార్క్ జాలర్లకు దొరికిందట. అంతకు ముందు, 1959లో ఆస్ట్రేలియా దక్షిణ తీర ప్రాంతంలో 2,664 పౌండ్ల బరువుగల భారీ షార్క్ జాలర్ల వలలో పడింది.

Comments: Post a Comment



<< Home

This page is powered by Blogger. Isn't yours?