Saturday, November 28, 2009

 

భారీ టైటిల్

2007లో ఇటలీకి చెందిన డేవిడ్ సిలిబ్రిటీ రాసిన ఒక పుస్తకం టైటిల్ ఎంత పెద్దదో తెలుసా ? అందులో 290 పదాలున్నాయట. ఇప్పటి వరకూ ఇదే ప్రపంచ రికార్డ్. ఇప్పుడు మన రాష్ట్రానికి చెందిన వంగీపురం శ్రీనాథాచారి ఆ రికార్డ్‌ను బద్దలకొట్టారు. మహబూబ్‌నగర్ 'పాలమూరు విశ్వవిద్యాలయం'లో సహాయ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న శ్రీనాథాచారి తన పుస్తకానికి 1086 పదాలతో కూడిన అతిపెద్ద టైటిల్ పెట్టారు.

Thursday, January 24, 2008

 

సౌరశక్తి గొప్పదనం

సౌరశక్తి మనకు ఇచ్చే వరాలేమిటో తెలుసా... ఇక్కడ క్లిక్ చేసి వినండి మరి.

Wednesday, September 27, 2006

 

షార్క్ కడుపులో 55 పిల్లలు

ప్రపంచంలో ఎన్నెన్నో వింతలు. ఒకే కాన్పులో ముగ్గురు లేదా నలుగుర్ని కనడం మనుషుల విషయంలో వింత అయితే, అక్కడెక్కడో ఇంకొవిడ ఏడుగురు పిల్లల్ని కనడానికి సిద్ధంగా ఉందట (ఈ సమాచారం అందేనాటికి...). ఇప్పుడు సముద్ర జీవుల విషయానికి వస్తే... ఒక షార్క్ చేప లెక్కకు మించిన సంఖ్యలో 55 పిల్లల్ని కంది. అయితే, ఇందుకోసం ఘోరంగా దాని ప్రాణాలు తీసారు. అదే పాపం అనిపించింది. ఆ వివరాలు మీ కోసం...

బోకా గ్రాండే ప్రాంతంలో మే 23న హేమర్‌హెడ్‌ షార్క్‌ (1,262 పౌండ్ల బరువు, 14.5 అడుగుల పొడవు, 3 అడుగుల వెడల్పు) కడుపులో 55 పిల్లలతో జాలరి బకీ డెనిస్ మిత్ర బృందానికి చిక్కింది. హేమర్‌హెడ్‌ షార్క్‌ కడుపులో ఇన్ని పిల్లలు ఉండడం ప్రపంచ రికార్డు. తరువాత ఈ షార్క్‌ను పోస్ట్‌మార్టమ్‌ నిమిత్తం మోటె మెరైన్‌ ల్యాబరెటరీకి తరలించారు. దీని వయసు 40 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటివరకు ఈ షార్క్‌ ఒకేసారి 20 నుంచి 40 పిల్లలకు మాత్రమే జన్మనివ్వగలదనేది అందుబాటులో ఉన్న సమాచారం.

దీనికి ముందు, 1982లో 991 పౌండ్ల బరువుగల షార్క్ జాలర్లకు దొరికిందట. అంతకు ముందు, 1959లో ఆస్ట్రేలియా దక్షిణ తీర ప్రాంతంలో 2,664 పౌండ్ల బరువుగల భారీ షార్క్ జాలర్ల వలలో పడింది.

Saturday, April 15, 2006

 

సహారా అమెరికాకంటే పెద్దది

దాదాపు 90 లక్షల చదరపు కిలోమీటర్ల వైశాల్యం గల సహారా ఎడారి అమెరికా అంత పెద్దదట.

Thursday, April 06, 2006

 

ఎన్నో మాయలు

దేశదేశాల్లో దశదిశలా ఉన్న అద్భుతాలు, వింతలు అన్నీ కాకపోయినా వీలైనన్నిటిని మీ ముందుకు తెచ్చే ప్రయత్నమే ఇది.

This page is powered by Blogger. Isn't yours?